- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
suicide : చెప్పులు, కాలేజీ బ్యాగ్ కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
by Sridhar Babu |
చెప్పులు, కాలేజీ బ్యాగ్ కొనివ్వలేదని ఆవేశంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ,పటాన్ చెరు : చెప్పులు, కాలేజీ బ్యాగ్ కొనివ్వలేదని ఆవేశంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అమీన్ పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని నర్రెగూడెం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే సయ్యద్ సయ్యద్ జావిద్ కూతురు బుష్రా ఫాతిమా డిగ్రీ చదువుతోంది.
తల్లి జరీనా బేగంతో తనకు కొత్త చెప్పులు, కాలేజీ బ్యాగు కోనివ్వమని అడగ్గా వారం రోజుల తర్వాత ఇప్పిస్తామని చెప్పినట్టు తల్లిదండ్రులు తెలిపారు. అయితే తల్లిదండ్రులు తనకు చెప్పులు, కాలేజీ బ్యాగు కొనివ్వలేదని కోపంతో బుష్రా ఫాతిమా(18) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి సయ్యద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Tags
- suicide
Next Story






