- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువకుడి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం యువకుడు దుర్మరణం పాలైన ఘటన గుజరాత్ రాష్ట్రం (Gujarat)లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఖమ్మం యువకుడు దుర్మరణం పాలైన ఘటన గుజరాత్ రాష్ట్రం (Gujarat)లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా (Khammam District)లోని నాయకన్‌గూడెంకు చెందిన కంచర్ల సంపత్‌రెడ్డి (20) అనే యువకుడు గుజరాత్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సాయంత్రం వేళ స్నేహితుడితో కలిసి సరదాగా బైక్‌పై బయటకు వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో సంపత్‌రెడ్డి (Sampath Reddy)కి తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అదే బైక్‌పై వెనకాలే ఉన్న స్నేహితుడికి కూడా తీవ్ర గాయాలు కాగా అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. సంపత్‌రెడ్డి మరణ వార్త విన్న నాయకన్‌గూడెం (Nayakangudem)లో విషాద ఛాయలు అలముకున్నాయి.






