- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. కిలో మీటరు మేర ట్రాఫిక్ జామ్
రెండు లారీలు ఢీకొని ఒకరు దుర్మరణం పాలైన ఘటన యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం వద్ద చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రెండు లారీలు ఢీకొని ఒకరు దుర్మరణం పాలైన ఘటన యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై కిలో మీటరు మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిత్యం అదే రూట్లో రాకపోకలు కొనసాగించే ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో అవస్థలు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






