- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన బంధువులు
దిశ, గద్వాల: మద్దెలబండకు చెందిన బోయ జక్కిడిబావి నర్సింహులు(35) మృతదేహానికి రీ పోస్టు మార్టం చేసి, హత్యకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం మల్దకల్ మండల కేంద్రంలో బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నర్సింహులపై దాడి చేసి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వేసి విద్యుద్ఘాతంతో మృతి చెందినట్లు చిత్రీకరించినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా మల్దకల్ పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నర్సింహుల ది ముమ్మాటికి హత్యనేని, దోషులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.
దీంతో గద్వాల అయిజ రోడ్డు మీద సుమారు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ నాగేశ్వర్ రెడ్డి, మల్దకల్, గట్టు, కేటిదొడ్డి, గద్వాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఆందోళన విరమించేందుకు ప్రయత్నాలు చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. హత్యకు కారకులైన నిందితుల పేర్లు చెప్తామని వారిని గుర్తించి వారి పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆందోళనకారులు కోరారు. గద్వాల జిల్లా ఏఎస్పీ గుణశేఖర్, గద్వాల డీఎస్పీ సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి, ధర్నా విరమించాలని కోరారు. అనుమానవ్యక్తం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన విరమించుకున్నారు. మృతదేహాని దహన సంస్కరణలకు తరలించారు.
వివరాలకు వెళ్లితే..
మల్దకల్ మండలం మద్దెలబండకు చెందిన బోయ జక్కిడి బావి నర్సింహులు తన వ్యవసాయ పొలంలో పత్తి పంటను సాగుచేస్తున్నాడు. రోజులాగే పంట పొలానికి నీరుపారేందుకు వెళ్లగా శుక్రవారం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ ఘాతంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. నర్సింహులు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు.