అత్యాచారం చేయబోయిన డాక్టర్.. అది కోసి పారిపోయిన నర్సు

by Pulgam srinivas |   (  Updated:2024-09-13 09:19:46  IST  )

కోల్‌కతాలో ఇటీవల జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరువకముందే తాజాగా పట్నాలో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకోబోయింది.

అత్యాచారం చేయబోయిన డాక్టర్.. అది కోసి పారిపోయిన నర్సు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కోల్‌కతాలో ఇటీవల జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆ ఘటన గురించి మరువకముందే తాజాగా పట్నాలో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకోబోయింది. కానీ నిందితులను ధైర్యంగా ఎదుర్కొన్న బాధితురాలు ఏకంగా జననాంగాలు కోసి తప్పించుకుంది. ఈ ఘటన బిహార్‌ (Bihar) రాజధాని పట్నాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

పట్నా (Patna)లోని సమస్తిపుర్‌ జిల్లాలోని ఆర్‌బీఎస్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో మద్యం మత్తులో ఉన్న డాక్టర్‌, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్‌ అయిన సంజయ్‌ కుమార్‌ మరో ఇద్దరు సహాయకులతో కలిసి బుధవారం (Wednesday) రాత్రి విధుల్లో ఉండగా ఉన్న ఓ నర్సుపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో సదరు బాధితురాలు తనను తాను కాపాడుకునేందుకు పదునైన బ్లేడ్‌తో డాక్టర్‌ జననాంగాలను కోసేసింది. అనంతరం పారిపోయి పోలీసులకు ఫోన్‌లో చేసి జరిగినదంతా వివరించింది.

సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు ఆసుపత్రికి వెళ్లి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సంజయ్‌ కుమార్‌ పాండే తెలిపారు. అత్యాచార యత్నానికి ముందు నిందితులు ఆసుపత్రి (Hospital)కి ప్రధాన ద్వారానికి లోపలివైపు నుంచి తాళం వేసి, సీసీటీవీలను ఆపేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, సోదాల్లో ఆసుపత్రిలో మద్యం బాటిల్‌ (Liquor bottles)ను, బ్లేడ్‌ను, రక్తపుమరకలు ఉన్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే ఈ వ్యవహారంలో నర్సు ధైర్యంగా వ్యవహరించి తప్పించుకుందని డీఎస్పీ ప్రశంసించారు.

Next Story