- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MS ధోని వీరాభిమాని ఆత్మహత్యకు కారణం అదేనా?
ప్రపంచంలో ఏ క్రికెటర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ టీమిండియా మాజీ సారథి ఎమ్ఎస్ ధోనికి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఏ క్రికెటర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ టీమిండియా మాజీ సారథి ఎమ్ఎస్ ధోనికి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దిగ్గజ క్రీడాకారులే స్వయంగా ఆయన్ను ఆరాధిస్తుంటారు. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించడంతో పాటు రెండు ప్రపంచ కప్‌లు సాధించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన అభిమాని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. తమిళనాడులోని కడలూర్ జిల్లా అరంగూర్‌కు చెందిన గోపికృష్ణన్(34) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు రోజు రాత్రి డబ్బుల విషయంలో అదే ప్రాంతానికి చెందిన కొందరు గోపికృష్ణన్‌పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన అందరూ పడుకున్నాక సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం కేసు దర్యా్ప్తులో ఉంది. కాగా, గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను తలపించేలా పసుపు రంగుతో తన ఇంటిని మార్చేసి గోపికృష్ణన్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.






