dowry harassment : వరకట్న వేధింపులకు వివాహిత బలి

by Sridhar Babu |

వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

dowry harassment : వరకట్న వేధింపులకు వివాహిత బలి
X

దిశ,పటాన్ చెరు : వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. అమీన్ పూర్ సీఐ సదా నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామానికి చెందిన అంగడి మహేష్, కొరివి హర్షిత ప్రేమించుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలపడంతో గత మార్చి నెలలో రూ. 3 లక్షల కట్నం ఇచ్చి వివాహం జరిపించారు. సుమారు 4 నెలల క్రితం నుంచి భార్య భర్తలు అమీన్పూర్ మండలంలోని పటేల్ గూడలోని సిద్ధార్థ ఎంక్లేవ్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

పెళ్లయిన నాటి నుంచి మహేష్ ఏం పని చేయకుండా ఖాళీగా ఉండడంతో ఖర్చుల నిమిత్తం నెలనెలా అత్తారింటి‌ నుంచి రూ. 30 వేలు పంపిస్తున్నారు. బెంగళూర్ నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆఫర్ లెటర్ వచ్చినా నెల నెలా డబ్బులు పంపాలని, మామ ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలంటూ మానసికంగా, శారీరకంగా వేధించడంతో మహేష్ భార్య హర్షిత (23) ఆ బాధలు తట్టుకోలేక బెడ్ రూంలో కిటికీ ఊచలకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు అమీన్ పూర్ పోలీసులు వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story