ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి..

by Taduka Kalyani |

ద్విచక్ర వాహనంపై వెళ్తూ మూలమలుపు వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం దామరచర్ల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి..
X

దిశ, మిర్యాలగూడ (దామరచర్ల): ద్విచక్ర వాహనంపై వెళ్తూ మూలమలుపు వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం దామరచర్ల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన చల్లా రవి శంకర్ (35 ) తన మోటార్ సైకిల్ పై దామరచర్ల నుంచి వాడపల్లి కి వెళ్తూ దామరచర్ల గ్రామ శివారులోని వీల్ కేర్ మూలమలుపు వద్ద రిపేర్ కోసం ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు వాడపల్లి ఎస్సై రవి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story