- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీధి కుక్క కరిచి వ్యక్తి మృతి
వీధి కుక్క దాడిలో ఓ వ్యక్తి గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

X
దిశ,చిలిపిచెడ్ : వీధి కుక్క దాడిలో ఓ వ్యక్తి గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఫైజాబాద్ గ్రామానికి చెందిన మ్యాకల శ్రీనివాస్(41) గత నెల రోజుల క్రితం తన పొలం వద్దకు వెళ్లగా గుడిసెలో నిద్రిస్తున్న కు క్క ఒక్కసారిగా శ్రీనివాస్ పై దాడి చేసి గాయపరిచింది.
కుక్క కాటుకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నా ఫలితం లేక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వారం రోజుల క్రితం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు.
- Tags
- Man dies
Next Story






