- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన జిల్లా అధికారి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.

X
దిశ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ వద్ద ఓ వ్యక్తి నుంచి ఇండస్ట్రియల్ మేనేజర్ శ్రీనివాస్ రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇండస్ట్రియల్ ఆఫీసులోనే మేనేజర్ శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని లంచాలకు అడ్డగా మార్చడం జిల్లా అధికారుల్లో కలకలం సృష్టించింది. అయితే శ్రీనివాస్ ఎవరి నుంచి లంచం తీసుకున్నాడు.. ఏ పని గురించి ఇబ్బందులకు గురి చేశాడనేది మరి కొద్దిసేపట్లో ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Next Story






