- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
check bounce case : చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష
చెక్ బౌన్స్ కేసులో మురళీధర్ రావు కు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం రెండవ అదనపు జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయి శ్రీ మంగళవారం తీర్పు చెప్పారు.

దిశ,కొత్తగూడెం : చెక్ బౌన్స్ కేసులో మురళీధర్ రావు కు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం రెండవ అదనపు జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయి శ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి..కొత్తగూడెంకు చెందిన న్యాయవాది ఇలమోలు ఉదయ భాస్కర్ రావు వద్ద భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లె మండలం శ్రీనగర్ కాలనీకి చెందిన నూతలపాటి మురళీధర్ రావు రూ. 25 లక్షల నగదును అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోటు రాయించి ఇచ్చాడు. ఆ ప్రామిసరీ నోటు ద్వారా డబ్బులు తిరిగి చెల్లించనందున ఖమ్మం 6వ అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.
అయినప్పటికీ డబ్బులు తిరిగి చెల్లించకుండా 2017 డిసెంబర్ 15న 20 లక్షల రూపాయలకు చెక్కు తన ఖాతా ద్వారా తీసుకోమని రాసి ఇచ్చాడు. ఆ చెక్ ను ఫిర్యాదుదారు తన బ్యాంకు ఖాతాలో వేసుకోగా బౌన్స్ అయింది. లీగల్ నోటీసు ద్వారా మురళీధర్ రావుకు నోటీసు ముట్టినప్పటికీ ఎటువంటి సమాధానం లేనందున కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. కోర్టులో కేసు విచారణ అనంతరం నూతలపాటి మురళీధర్ రావు పై నేరం రుజువు కాగా, ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. ఫిర్యాదుదారు తరఫున న్యాయవాది రమేష్ కుమార్ మక్కడ్ వాదించారు.






