- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనం కేసులో తండ్రి కొడుకుకి జైలు శిక్ష..
by Chintha Aamani |
మండలంలో జరిగిన ఒక దొంగతనం కేసులో తండ్రి కొడుకులు ఇద్దరికీ

X
దిశ, వీపనగండ్ల: మండలంలో జరిగిన ఒక దొంగతనం కేసులో తండ్రి కొడుకులు ఇద్దరికీ వనపర్తి ఫస్ట్ అడిషనల్ జడ్జి జైలు శిక్ష జరిమానా విధించినట్లు వీపనగండ్ల ఎస్సై నందికర్ తెలిపారు. 2020 సంవత్సరం నవంబర్ నెలలో తూముకుంట గ్రామానికి చెందిన బత్తుల మల్లమ్మ అనే మహిళ పొలం పనులకు వెళ్తుండగా రహదారిపై మాటువేసి ఉన్న కల్వలకోలు గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు వెంకటయ్య గోపాలకృష్ణుడు బత్తుల మల్లమ్మను బెదిరించి ఆమె మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు ను లాక్కెళ్ళి నట్లు తెలిపారు. వారిని విచారించి కోర్టులో హాజరు పరచగా నేరం రుజువు కావడంతో వనపర్తి ఫస్ట్ అడిషనల్ జడ్జ్ బండారి శ్రీలత నిందితులకు రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు జైలు శిక్ష, 200 రూపాయలు జరిమానా విధించినట్లు ఎస్సై నందికర్, కోర్టు కానిస్టేబుల్ రాజేందర్ వివరించారు.
Next Story






