- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఇద్దరు నిందితుల అరెస్ట్
అక్రమ గంజాయి మారక ద్రవ్యాల రవాణా పై ప్రత్యేక దృష్టి

దిశ, నెల్లికుదురు : అక్రమ గంజాయి మారక ద్రవ్యాల రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపాడం జరుగుతుందని తొర్రూరు సీఐ జగదీష్ హెచ్చరించారు .స్థానిక పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను నెల్లికుదురు ఎస్.ఐ రమేష్ బాబు సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగిందని నమ్మదగిన సమాచారం మేరకు మహబూబాబాద్ నుండి నెల్లికుదురు కు వస్తున్న ఆటొలొ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న బాబుల మాడి,(ఒడిశా) రతన్ బదాయి (ఒడిశా) రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.వారి వద్ద నుంచి 1,58,250 రూపాయలు విలువ గల 6.33 కేజీల నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకుని ఇ నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారన్నారు. కేసులో నిందితులను పట్టుకున్న ఎస్.ఐ రమేష్ బాబు, సిబ్బందిని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించడం జరిగిందన్నారు.






