- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ ఘటన.. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని వ్యక్తి మృతి
కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇడ్లీ తింటూ ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కేరళలోని వలయార్‌లో శనివారం ఓ పండుగ సందర్భంగా ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు.

X
దిశ,వెబ్‌డెస్క్:కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇడ్లీ తింటూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని వలయార్‌లో శనివారం ఓ పండుగ సందర్భంగా ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 50 ఏళ్ల వ్యక్తి పాల్గొన్నాడు. పోటీలో పాల్గొన్న సమయంలో ఆ వ్యక్తి ఇడ్లీ తింటుండగా ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి గొంతులోంచి ఇడ్లీని బయటకు తీశారు. కానీ ఆ వ్యక్తి ఆరోగ్యం అప్పటికే క్షీణించడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.
Next Story






