- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లవ్ చేయకుంటే చంపేస్తా.. గలీజుగాళ్ల ధమ్కీలు.. లేడీ డాక్టర్‌నూ వదలని పోకిరీ
ఈవ్ టీజర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. టీనేజ్ అమ్మాయి, పెళ్లైన యువతి, గృహిణి ఇలా ఎవరైనా సరే.. ప్రేమించమని వెంటపడుతున్నారు.

డాక్టర్‌ను కొట్టిన పోకిరీ
‘‘బొడ్డుప్పల్ ప్రాంతానికి చెందిన ఆమె ఓ డాక్టర్. ప్రేమించమని ఓ యువకుడు ఆమె వెంటపడ్డాడు. డాక్టర్ తిరస్కరించడంతో ఆమె పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లి బెదిరించడంతోపాటు కొట్టాడు’’.
ఏయ్ నీ కూతుర్ని లవ్ చేయమని చెప్పు..
వెలిగొండ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. ప్రేమించమని ఓ పోకిరి ఆమె వెంటపడ్డాడు. విద్యార్థిని పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ‘‘మీ కూతురుని నన్ను లవ్ చేయమని చెప్పు.. లేదంటే చంపేస్తాను’’ అని బెదిరించాడు.
దిశ, రాచకొండ : ఈవ్ టీజర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. టీనేజ్ అమ్మాయి, పెళ్లైన యువతి, గృహిణి ఇలా ఎవరైనా సరే.. ప్రేమించమని వెంటపడుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. పట్టించుకోకపోతే దాడులకు పాల్పడుతున్నారు. మరికొంత మంది బరితెగించిన పోకిరీలు యువతుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరి మీ అమ్మాయిని ప్రేమించమని చెప్పు.. లేకపోతే చంపేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. విద్యార్థిని, ఉద్యోగిని, డాక్టర్.. ఇలా ఎవరనే తేడా లేకుండా ఈవ్ టీజర్లు వెంటపడి వేధిస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీసులు 15 రోజుల్లోనే 66 మంది ఈవ్ టీజర్లను కటకటలాల్లోకి నెట్టారు.
15 రోజుల్లో 66 మంది అరెస్ట్
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత 15 రోజుల్లో 34 మంది మేజర్లు, 32 మంది మైనర్లు షీ టీమ్స్‌కు పట్టుబడ్డారు. వీరందరిపై క్రిమినల్, పెట్టీ, కౌన్సిలింగ్ కేసులు నమోదు చేశారు. మంగళవారం ఈ 66 మంది పోకిరీలకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో షీ టీమ్స్ డీసీపీ ఉషా విశ్వనాథ్, షీ టీమ్స్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాధిత యువతులు, మహిళలు భయభ్రాంతులకు గురి కావొద్దని డీసీపీ కోరారు. మీ భద్రత, రక్షణ కోసం పోకిరీల వేధింపులపై రాచకొండ షీ టీమ్స్ నెంబర్ +918712662111కు సమాచారం ఇవ్వాలని డీసీపీ ఉషా విశ్వనాథ్ తెలిపారు






