- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా గుడుంబా తయారీ ముడి సరుకు స్వాధీనం
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదరబస్తీ ఏరియాలో గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పట్టికను కొత్తగూడెం ఎక్సైజ్ శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

దిశ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని మేదరబస్తీ ఏరియాలో గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పట్టికను కొత్తగూడెం ఎక్సైజ్ శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ సీఐ జయశ్రీ శనివారం తెలిపారు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పది లీటర్ల నాటుసారా, 70 కేజీల పట్టిక, 3740 కేజీల బెల్లంను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
వీటి విలువ సుమారు రెండు లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా అకిరా పల్లి గ్రామానికి చెందిన షేక్ బాజీ అక్రమంగా గుడుంబాకు ఉపయోగించే ముడి సరుకును వాహనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొత్తగూడెంకు తీసుకొస్తున్న సమాచారం అందుకున్న మేరకు పట్టుకున్నట్టు తెలిపారు. గుడుంబా ముడి సరుకును తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, కిరణ్, సత్యనారాయణ, సాయి పల్లవి పాల్గొన్నట్లు పేర్కొన్నారు.






