- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సల్మాన్ తర్వాత ఈ సింగర్ ఇంటి ముందు కాల్పులు.. ‘‘కుక్క చావు చస్తావ్’’ అంటూ ఫేస్‌బుక్‌లో వార్నింగ్..!
పంజాబీ సింగర్ ఏపీ ఢిల్లోన్ ఇంటి ముందు కొంతమంది దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపిన ఘటన మరువక ముందే.. ఇప్పుడు అదే గ్యాంగ్ మరో బాలీవుడ్ సెలబ్రిటీ ఇంటి ముందు కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కెనడాలో ఉన్న పంజాబీ సింగర్ ఏపీ ఢిల్లోన్ ఇంటి ముందు ఈ కాల్పుల ఘటన జరిగింది. ఆదివారం కొంతమంది దుండగులు ఢిల్లోన్ ఇంటి ముందు బుల్లెట్ల వర్షం కురిపించారు. అదృష్టవశాత్తూ కాల్పుల్లో ఎవ్వరూ గాయపడకపోయినా స్థానికంగా మాత్రం ఈ ఘటన తీవ్ర భయాందోళనలు కలిగించింది.
కాగా.. కాల్పులు తామే జరిపామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడైన రోహిత్ గోద్రా ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించాడు. తన పాటల్లో సల్మాన్ ఖాన్‌ని తీసుకురావడం వల్లే అతడి ఇంటి ముందు ఫైరింగ్ చేశామని చెప్పాడు. అండర్‌వరల్డ్‌తో పెట్టుకుంటే కుక్క చావు చస్తావంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీనిపై ప్రస్తుతం అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.






