- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fraud: ఇద్దరమ్మాయిల ముద్దుల ప్రియుడు.. కట్ చేస్తే రూ.10 లక్షలకు కుచ్చుటోపి
ప్రేమించినోడిని నమ్మి నిలువునా మోసపోయానని ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించినోడిని నమ్మి నిలువునా మోసపోయానని ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన అనూషకు బిల్డర్ విజయ్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారి స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే వృత్తిరీత్య విజయ్‌కి డబ్బులు అవసరం ఉండటంతో నాలుగైదు సార్లు అనూష తన నగలను తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చింది. అయితే, ఐదోసారి కూడా రూ.10 లక్షలు విలువ చేసే నగలను అనూషతో విజయ్ ఇటీవలే తాకట్టు పెట్టించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా, అనూషతో సన్నిహితంగా ఉంటూనే విజయ్ ఓ వివాహితతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. విషయం తెలుసుకున్న అనూష తాను నిలువునా మోసపోయానని గ్రహించింది. తాను విజయ్‌కి డబ్బు, బంగారం ఇచ్చానని ఆరోపించింది. అదేవిధంగా తనను మోసం చేశాడనే కోపంతో విజయ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అనంతరం తనకు వెంటనే న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.






