పనిమనిషిపై జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ అత్యాచారం.. ఆయన కొడుకు కూడా..!

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-24 09:18:00  IST  )

హైదరాబాద్‌లో పనిమనిషిపై అత్యాచారం కేసులో నిన్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళి ముకుంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పనిమనిషిపై జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ అత్యాచారం.. ఆయన కొడుకు కూడా..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో పనిమనిషిపై అత్యాచారం కేసులో నిన్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళి ముకుంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్, మిథులానగర్‌లోని తన ఇంట్లో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నాంపల్లి జడ్జి నివాసంలో మురళి ముకుంద్ ను పోలీసులు హాజరుపరిచారు. పనిమనిషి దళిత యువతి కావడంతో నిందితుడిపై అత్యాచారంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. కాగా, మొదట మురళిముకుంద్ అత్యాచారానికి పాల్పడ్డాడని అతని కొడుకు ఆకాష్‌కు బాధిత యువతి చెబితే అతను కూడా ఆమెపై దాడికి దిగాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే అతని కోడుకు ఆకాష్‌పై కేసు నమోదు చేశారు.

Next Story