- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
suicide : భార్య మందలించిందని బలవన్మరణం
భార్య మందలించిందని మనస్థాపం చెంది ఉరివేసుకొని వ్యక్తి చనిపోయిన ఘటన హుస్నాబాద్ లో చోటుచేసుకుంది.

దిశ, హుస్నాబాద్ : భార్య మందలించిందని మనస్థాపం చెంది ఉరివేసుకొని వ్యక్తి చనిపోయిన ఘటన హుస్నాబాద్ లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. హుస్నాబాద్ పట్టణంలో నివసిస్తున్న పోలు సమ్మయ్య (45) పట్టణంలో తోపుడుబండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగి వచ్చి రోజూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. భార్య ఎంత సర్ది చెప్పినా వినేవాడు కాదు. గురువారం యధావిధిగా పనికి వెళ్లి వచ్చిన అనంతరం రాత్రి తాగి వచ్చి ఇంటికి చేరుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ ఏర్పడి చనిపోతా అని పేర్కొన్నాడు.
ఎప్పుడూ ఇలానే అంటూ ఉండేవాడు కదా అని భార్య అనుకుంది. అందరూ పడుకున్న తర్వాత రాత్రి ఇంటి బయట ఉన్న పిల్లర్ ఇనుప చువ్వలకు తాడుతో ఉరి వేసుకొని చనిపోయాడు. తెల్లవారిన తరువాత భార్య లేచి చూసేసరికి ఉరి వేసుకుని చనిపోయి కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడికి పిల్లలు లేరు. ఆరు నెలల క్రితమే హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి నుండి హుస్నాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు.
- Tags
- suicide






