- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడిక్కకడే నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన లారీ టైర్ మారుస్తుండగా ఒక్కసారిగా రోడ్డుపక్కన ఉన్నవారిపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను ప్రసాద్, కిషోర్, నాగయ్య, రాజుగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..
BREAKING: జీపు టైర్ పేలి బోల్తా.. 40 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
Next Story






