సెల్ఫీ వీడియో తీసుకుని రైతు ఆత్మహత్య

by Taduka Kalyani |

భూ వివాదంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామాయంపేట మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.

సెల్ఫీ వీడియో  తీసుకుని రైతు ఆత్మహత్య
X

దిశ, నిజాంపేట: భూ వివాదంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామాయంపేట మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సుతార్ పల్లి గ్రామానికి చెందిన పున్న స్వామి (53) కి చెందిన భూమి విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతుంది. ఈ వివాదంలో కొందరు వ్యక్తులు స్వామిని బెదిరించడంతో మనస్థాపానికి గురైన స్వామి నాలుగు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. తన కూతురు, అల్లుడులను గ్రామస్తులు చూసుకోవలని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story