- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబాయ్ వెళ్లి వచ్చినా పరిస్థితి మారకపోవడంతో....
by Sridhar Babu |
విదేశాలకు వెళ్లిన యువకుడు సరైన ఉపాధి లేక తిరిగి వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది.

X
దిశ, లోకేశ్వరం : విదేశాలకు వెళ్లిన యువకుడు సరైన ఉపాధి లేక తిరిగి వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. ఏఎస్ఐ దిగంబర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన కన్నం పోశెట్టి (32) గత మూడు సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లగా సరైన ఉపాధి లభించకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి మృతునికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మద్యానికి బానిసై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగగా జీవితంపై విరక్తి చెంది బుధవారం మధ్యాహ్నం పుష్పూరు గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
- Tags
- suicide
Next Story






