- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha effect : దిశ ఎఫెక్ట్... 10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
మల్యాల మండలంలో రేషన్ బియ్యం దందా అనే దిశ కథనానికి అధికారులు స్పందించారు.

X
దిశ, మల్యాల : మల్యాల మండలంలో రేషన్ బియ్యం దందా అనే దిశ కథనానికి అధికారులు స్పందించారు. మల్యాల గ్రామంలో సంఘ రాములు ఇంటి ఆవరణలో ఉన్న రేషన్ బియ్యాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నిలువ ఉంచారన్న విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై గోదాంకు తరలించారు. ఈ దాడులలో సివిల్ సప్లై డీటీసీఎస్ శ్రీనివాస్, ఎఫ్ఐ స్వామి, మల్యాల ఆర్ఐ తిరుపతి, బ్లూకోట్ సిబ్బంది ప్రసాద్, నర్సింగ్ పాల్గొన్నారు.
- Tags
- Disha effect
Next Story






