శ్మశానంలో సమాధుల మధ్య దారుణం.. డిగ్రీ విద్యార్థిని చంపేసి..

by Bhoopathi Nagaiah |

చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి పెద్దగా మారతాయి. కూర్చోని మాట్లాడుకుంటే సమసిపోయే గొడవలను కూడా కొంత మంది భూతద్దంలో చూసి హత్యల వరకు వెళ్తున్నారు.

శ్మశానంలో సమాధుల మధ్య దారుణం.. డిగ్రీ విద్యార్థిని చంపేసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి పెద్దగా మారతాయి. కూర్చోని మాట్లాడుకుంటే సమసిపోయే గొడవలను కూడా కొంత మంది భూతద్దంలో చూసి హత్యల వరకు వెళ్తున్నారు. ఇలాంటి ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఇద్దరి యువకుల మధ్య ఉన్న చిన్న గొడవే ఒకరి ప్రాణాలను తీసేలా చేసింది. డిగ్రీ చదివే విద్యార్థిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..

రేపల్లె పట్టణానికి చెందిన మేక సాయి (24)కి ఇదే మండలం అరవపల్లికి చెందిన హర్ష మధ్య మనస్పర్ధాలు ఉన్నాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి.. బ్లేడ్ హర్ష మధ్య పలుమార్లు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే సోమవారం అరవపల్లి శివారులోని క్రైస్తవ శ్మశాన వాటిలో వీరిద్దరు మధ్య గొడవ జరిగింది. ఇదే అదునుగా భావించిన బ్లేడ్ హర్ష తన వెంట తెచ్చుకత్తితో సాయిని విచక్షణ రహితంగా పొడుస్తూ దాడికి దిగాడు. కత్తిపోట్లకు గురైన సాయి అక్కడే సమాధుల మధ్య కుప్పకూలిపోయాడు. అతడిని ఎవరూ గమనించకపోవడంతో తీవ్ర రక్తస్రావమై శ్మశానంలోనే మృతి చెందాడు. మంగళవారం అటుగా వెళ్లిన స్థానికులు సాయి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడిని మేక సాయిగా గుర్తించారు. హతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఘటన స్థలంలో ప్రాథమిక ఆధారాలను సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించి హత్యకు పాల్పడింది బ్లేడ్ హర్షగా గుర్తించారు. హర్షకు నేరచరిత్ర ఉండటంలో పోలీసులు అతడిని విజయవాడ నగర బహిష్కరణ చేసినట్లు చెబుతున్నారు. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని, స్పెషల్ టీం ఏర్పాటు చేసి అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story