- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమకథతో అలరించబోతున్న మౌనీ రాయ్.. ఊహించని సర్‌ప్రైజులు ఉండబోతున్నాయంటూ మేకర్స్ ప్రకటన
ఈ కథలోని ముఖ్యమైన పాత్ర భావోద్వేగాలను, అందాన్ని సమర్థవంతంగా చూపించగల నటి కావాలని అనుకున్నాం. అందుకు మౌనీ రాయ్ సరిగ్గా సరిపోతారని భావించాం.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నారు. ఇటీవల రొమాంటిక్ కామెడీ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’తో మెప్పించిన ఆమె ఇప్పుడు ఓ అందమైన ప్రేమకథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ రొమాంటిక్ జానర్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం. నిర్మాత ప్రేరణా అరోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మౌనీ రాయ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ కథను వినిపించిన వెంటనే మౌనీ రాయ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. .
ఇక మూవీ దర్శకుడు సురేష్ కృష్ణ మాట్లాడుతూ.. "ఈ కథలోని ముఖ్యమైన పాత్ర భావోద్వేగాలను, అందాన్ని సమర్థవంతంగా చూపించగల నటి కావాలని అనుకున్నాం. అందుకు మౌనీ రాయ్ సరిగ్గా సరిపోతారని భావించాం. ఆమె అద్భుతమైన ప్రతిభ ఉన్న నటి. మౌనీ రాకతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది" అని ప్రశంసించారు. సోషల్ మీడియా యుగంలో సాగే ఈ కాలపు యంగ్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతోందని నిర్మాత ప్రేరణా అరోరా తెలిపారు. మౌనీ రాయ్ ఈ సినిమాలో నటించడం ద్వారా ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన క్రేజ్ వచ్చిందని, కథ వినగానే ఆమె ఎంతో ఉత్సాహంగా ఒప్పుకున్నారని చెప్పారు. ఇందులో ప్రేక్షకులు ఊహించని ఎన్నో సర్ ప్రైజ్‌లు ఉండబోతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.






