ఫ్లాష్.. ఫ్లాష్.. సూర్యాపేటలో యువతి మృతదేహం కలకలం

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-12-11 12:13:36  IST  )

సూర్యాపేట జిల్లా కేంద్రం మినీ ట్యాంక్ బండ్ ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది. ఏ చిన్న వివాదం జరిగినా క్షణికావేశంలో వెంటనే మినీ ట్యాంక్ బండ్ వైపు పరుగు పెడుతున్నారు.

ఫ్లాష్.. ఫ్లాష్.. సూర్యాపేటలో యువతి మృతదేహం కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా కేంద్రం మినీ ట్యాంక్ బండ్ ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది. ఏ చిన్న వివాదం జరిగినా క్షణికావేశంలో వెంటనే మినీ ట్యాంక్ బండ్ వైపు పరుగు పెడుతున్నారు. ఇలా నెలకు ఒక్కరు, ఇద్దరు ఈ చెరువులో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మినీ ట్యాంక్ బండ్‌లో యువతి మృతదేహం తేలియాడటంతో స్థానికంగా కలకలం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బ్రహ్మదేవర విజయ (28) మృతదేహం లభ్యం అయింది. ఈమె సత్రం బజార్ పూల సెంటర్ చెందిన అవివాహిత గుర్తించారు పోలీసులు. కాగా, ఆమె ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్లింది..? ఆమె మృతికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్ట్ మార్డం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story