- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దావతే ప్రాణం తీసింది...
by Sridhar Babu |
ముప్కాల్ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన గురికాడి లింబాద్రి (50 ) మద్యం తాగి కిందపడి మృతి చెందాడు.

X
దిశ, బాల్కొండ : ముప్కాల్ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన గురికాడి లింబాద్రి (50 ) మద్యం తాగి కిందపడి మృతి చెందాడు. ఈ మేరకు ఎస్ఐ బి. నరేష్ తెలిపారు. శుక్రవారం బాల్కొండ శివారులోని ఫామ్ హౌస్ లో తన సహ డైరెక్టర్లతో కలిసి లింబాద్రి దావత్ చేసుకున్నాడు. అనంతరం ఇంటికి వచ్చేందుకు కొద్ది దూరం నడవగా కళ్లు తిరిగి బైక్ పై పడి అనంతరం కిందపడ్డాడు. దాంతో బైక్ అతనిపై పడటంతో ముక్కు, కనతకు, కుడి కన్నుకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య గురికాడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
- Tags
- Dawath party
Next Story






