సిరిమల్లె చెట్టు కాదు.. అది గంజాయి మొక్క

by Bhoopathi Nagaiah |

ఎవరైనా ఇంట్లో పూట మొక్కలో, పండ్ల చెట్లో పెంచుకుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ప్రభుత్వ నిషేధిత మొక్కలను పెంచుతూ పోలీసులకు చిక్కాడు.

సిరిమల్లె చెట్టు కాదు.. అది గంజాయి మొక్క
X

దిశ, సిరిసిల్ల: ఎవరైనా ఇంట్లో పూట మొక్కలో, పండ్ల చెట్లో పెంచుకుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ప్రభుత్వ నిషేధిత మొక్కలను పెంచుతూ పోలీసులకు చిక్కాడు. ఆయన ఏకంగా ఐదు దశాబ్దాలు ఈ సాగు చేసున్నాడట. అయినా ఇప్పటి వరకు ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి మొక్కల పెంపకం కలకలం రేపింది. జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీలో భారీగా గంజాయి చెట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ హైదర్ (65) అనే వ్యక్తి సొంత పెరట్లో 31 మొక్కలను పెంచాడు. 48 సంవత్సరాలుగా గంజాయి సాగు చేస్తున్నానని హైదర్ తెలిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story