- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ దారుణ హత్యలో కీలక మలుపు..మృతదేహం వద్ద బుల్లెట్లు లభ్యం
నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ చెందిన మహిళ శాలు బీ (42 ) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

దిశ, నందికొట్కూరు:నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ చెందిన మహిళ శాలు బీ (42 ) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన కీలక మలుపు తిరిగింది. మహిళా మృతదేహం వద్ద బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహిళను తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు విచారణలో బయట పడిందని సమాచారం.
ఈ హత్యకు ప్రధాన సూత్రధారి బీహార్‌కు చెందిన మనోజ్‌గా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ యువకుడు మిడుతూరు రోడ్డు లోని ఒక బుడ్డల పొట్టు పరిశ్రమలో పది రోజుల క్రితం డ్రైవర్‌గా చేరినట్లు సమాచారం. బీహార్ యువకుడి రూమ్‌లో మరి కొన్ని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అతనికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.






