- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య
by Sridhar Babu |
పిట్లం మండల కేంద్రానికి చెందిన మందటి బషవ్వ (42) పిట్లం ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

X
దిశ,పిట్లం : పిట్లం మండల కేంద్రానికి చెందిన మందటి బషవ్వ (42) పిట్లం ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచార అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరపగా కొంతకాలం కింద బషవ్వ భర్త పాపయ్య మరణించడంతో ఆమె తల్లి వద్దనే ఉండి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో పోయిన సంవత్సరం బషవ్వ తల్లి మరణించడంతో ఒంటరిగా మారింది. దీంతో మనస్థాపానికి గురై ఎవరూ లేని సమయంలో పిట్లం ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మృతురాలి అన్న మందటి గంగారం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
- Tags
- suicide
Next Story






