- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Choutuppal: చౌటుప్పల్ పీఎస్ పరిధిలో దారుణం.. కదులుతున్న బస్సులో వివాహితపై అత్యాచారం
కదులుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Private Travels Bus)లో వివాహితపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: కదులుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Private Travels Bus)లో వివాహితపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 18 కూకట్‌పల్లి (Kukatpally)కి చెందిన ఓ మహిళ ప్రయాణికురాలు విజయవాడ (Vijayawada) వెళ్లేందుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ (Morning Travels) బస్సు ఎక్కింది. ఈ క్రమంలో బస్సు సిబ్బందిలో ఒకరు ఆమెకు కూర్చునేందుకు సీటును కూడా చూపించాడు. అయితే, చౌటుప్పల్ (Choutuppal) శివారు ప్రాంతంలోకి రాగానే ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే, విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించడంతో ఆ వివాహిత సైలెంట్‌గా ఉండిపోయింది. కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR)ను నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు కేసును కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ (Kukatpally Police Station)కు బదిలీ చేశారు. కాగా, అత్యాచారం చేసే సమయంలో బస్సులో ఇతర ప్రయాణికులు లేరా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు కూకట్‌పల్లి పోలీసులు ఈ నెల 18న ఆ బస్సులో ఉన్న డ్రైవర్, క్లినర్‌గా ఎవరు విధుల్లో ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.






