Case filed: కొమురం భీం జిల్లాలో సంచలనం.. కాగజ్‌నగర్ మున్సిపల్ అధికారులపై కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2024-03-19 13:23:30  IST  )

ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్ మునిసిపల్ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

Case filed: కొమురం భీం జిల్లాలో సంచలనం.. కాగజ్‌నగర్ మున్సిపల్ అధికారులపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్ మున్సిపల్ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు సిర్పూర్ పేపర్ మిల్లు ప్రహరీని కూల్చారని మునిసిపల్ కమిషనర్ అంజయ్య, పులువురు కౌన్సిలర్లు అదేవిధంగా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్‌బాబుపై ఎస్పీఎం పరిశ్రమ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రహరీని కూల్చిన విషయంలో పోలీసులు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story