- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
arrest : గంజాయి విక్రేత అరెస్ట్
గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకుడిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించారు.

దిశ, బడంగ్ పేట్ : గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకుడిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించారు. అతని వద్ద నుంచి రూ.50 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్ ఇన్స్పెక్టర్ టి.భూపతి తెలిపిన వివరాల ప్రకారం....అస్సాం రాష్ట్రానికి చెందిన జైనుద్దీన్(21) ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం వలన వచ్చి షాహిన్ నగర్లోని షాజహాన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
గంజాయికి బానిసైన ఇతడు అస్సాం నుంచి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తీసుకొచ్చి స్థానికంగా అవసరమైన వారికి విక్రయించి విలాసవంతమైన జీవితాన్ని గడపసాగాడు. అల్ జాబ్రీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న విషయమై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ భూపతి నేతృత్వంలో డీఐ ఎ.మధు, ఎస్సైలు షేక్ యూసుఫ్ జానీ, శ్రీనివాసులు, నాగరాజు, శ్రీధర్ గౌడ్లు దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.50 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- arrest






