- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Theft : పట్ట పగలే తాళం వేసిన ఇంట్లో చోరీ
by Chintha Aamani |
పట్ట పగలు ఇంటి తాళం బద్దలు కొట్టి బీరువాలోని బంగారం,

X
దిశ,లోకేశ్వరం: పట్ట పగలు ఇంటి తాళం బద్దలు కొట్టి బీరువాలోని బంగారం, నగదు దొంగలు దోచుకెళ్లిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. లోకేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గడ్ చాందా గ్రామానికి చెందిన అంబకంటి లావణ్య ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి ముధోల్ లో గల కుమారుని వద్దకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి రాగా ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో దాచిన 35 గ్రాముల బంగారం, రూ.20000 నగదు కనిపించలేదు. ఈరోజు ఉదయం లోకేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్సై దిగంబర్ తెలిపారు. చోరీ అయిన సొత్తు విలువ దాదాపు రూ.150500 వరకు ఉంటుందని తెలిపారు.
- Tags
- Telugu News
- Theft
Next Story






