- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Theft : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడిలో బుధవారం

X
దిశ ప్రతినిధి,నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడిలో బుధవారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. పెంటయ్య అనే వ్యక్తి తన కుటుంబం ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఇదే అదునుగా బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాను ధ్వంసం చేసి వస్తువులన్నీ చిందరవందర చేశారు. బీరువాలో దాచి ఉంచిన 15 తులాల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని గురువారం ఉదయాన్నే గుర్తించిన స్థానికులు పోలీసులకు, బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
- Tags
- Telugu News
- Theft
Next Story






