- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యవకులు దుర్మరణం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్/ పిట్లం: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధాపూర్ తండాకు చెందిన కిషన్, సవాయి సింగ్‌లు బైక్‌పై వివాహానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్ అన్నారం కలాన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సవాయి సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కిషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ నడుపుతున్న సుభాష్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






