- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: నిజామాబాద్ జిల్లాలో సంచలనం.. రైలు కిందపడి యువ జంట బలవన్మరణం
నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది.

దిశ, నవీపేట్/వెబ్‌డెస్క్: గుర్తు తెలియని రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టపూర్ రైల్వే గేటు సమీపం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం.. పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన బండారి శైలజ(22) బండారి అనిల్ కుమార్(25) భార్యాభర్తలు. కుటుంబ తగాదాలు ఇతర కారణాలతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని వాట్సప్ స్టేటస్ పెట్టారు. అయితే, గమనించిన కుటుంబ సభ్యులు వారిని కాపాడాలనే ఉద్దేశంతో కోటగిరి ఎస్సైకి సమాచారం అందజేశారు.
మృతురాలు శైలజ చివరి ఫోన్‌కాల్ నవీపేట్ లొకేషన్ చూపించగా స్పందించిన ఎస్సై నవీపేట్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే నవీపేట్ ఎస్సై రాత్రి 11 గంటల సమయంలో తన సిబ్బందితో బాసర వరకు గాలించి ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపూర్ రైల్వే గేటు ఘటన స్థలానికి చేరుకుని రైల్వే పోలీసులకు సమాచారం అందజేశాడు. అనంతరం రంగంలోకి దిగిన రైల్వే ఎస్సై సాయిరెడ్డి, సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించామని రైల్వే పోలీసులు తెలిపారు. యువ దంపతుల ఆత్మహత్యకు కుటుంబ కలహాలేనా.. లేక మరే ఇతర కారణాలు ఉన్నాయ అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.






