- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ.. ఏకంగా ఏటీఎంకే కన్నం వేసిన దొంగలు
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్/బోధన్ : ఉమ్మడి జిల్లాలో ఏటీఎం దొంగలు రెచ్చిపోతున్నారు. గతంలో నవీపేట్ మండల కేంద్రంలో ఏటీఎం చోరీకి ప్రయత్నం చేయగా.. అలారం మోగింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో దొంగలు పారిపోయారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం ధ్వంసం చేసి గుర్తు తెలియని దొంగలు రూ.25 లక్షల నగదును అపహరించారు. ఎప్పుడు సందడిగా ఉండే బస్టాండ్ సమీపంలోని ఏటీఎం ధ్వంసం జిల్లాలో కలకాలం సృష్టచింది. అది కూడా పెద్ద ఎత్తున నగదును ఎత్తుకుపోవడం పట్ల పోలీసులు కేసును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. 24 గంటలు పోలీసులు ఆ రూట్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఏటీఎం చోరీకి పాల్పడటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు ఘటనా స్థాలానికి చేరుకున్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్ చోరీ జరిగిన ఏటీఎంను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






