- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం
బైక్ అదుపుతప్పి ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన నగరంలోని నాగోల్ బండ్లగూడలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బైక్ అదుపుతప్పి ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన నగరంలోని చాంద్రాయణగుట్ట బండ్లగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైక్‌పై ముగ్గురు అతివేగంగా వెళ్తుండగా బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం ఎదుట అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. స్థానికులు మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






