- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: పాదచారులను వేగంగా ఢీకొట్టిన బొలెరో.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
by Kema Shiva Kumar |
రోడ్డుపై వెళ్తున్న పాదచారులను బొలెరో ఢీకొట్టగా.. ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన విజయనగరం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డుపై వెళ్తున్న పాదచారులను బొలెరో ఢీకొట్టగా.. ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన విజయనగరం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డెంకాడ మండలం జొన్నాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన బొలెరో వాహనం రోడ్డుపై నిలిచి ఉన్న పాదచారులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా బొలెరోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుత్రికి తరలించారు.
Next Story






