- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: హైదరాబాద్ మియాపూర్‌లో బెట్టింగ్ ముఠా ఆరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం
by Kema Shiva Kumar |
దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఈవెంట్ యువతను ఊపేస్తోంది. టోర్నమెంట్‌లో భాగంగా ఇప్పటికే 40 శాతం మ్యాచ్‌లు ముగిశాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఐపీఎల్ ఈవెంట్ యువతను ఊపేస్తోంది. టోర్నమెంట్‌లో భాగంగా ఇప్పటికే 40 శాతం మ్యాచ్‌లు ముగిశాయి. అయితే, సరిగ్గా ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనే తేడా లేకుండా జోరుగా బెట్టింగ్‌లు నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలోని మియాపూర్‌లో యథేచ్ఛగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు దందాను నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా నిందితుల నుంచి రూ.1.96 లక్షల నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






