IED blast : ఐఈడీ పేలి బాలుడికి తీవ్ర గాయాలు..

by Batti.Sumithra |

చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెడియా మురుంపర సమీపంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడీ బాంబు పేలడంతో హిద్మా కవ్వాసి అనే 10 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

IED blast : ఐఈడీ పేలి బాలుడికి తీవ్ర గాయాలు..
X

దిశ, భద్రాచలం : చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెడియా మురుంపర సమీపంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడీ బాంబు పేలడంతో హిద్మా కవ్వాసి అనే 10 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పిల్లవాడికి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. హిద్మా కవాసి పటేల్పర ముతవెండి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగలూరులో నివాసముంటున్నాడు. మేకలు మేపడానికి అడవికి వెళ్ళాడు. శనివారం మధ్యాహ్నం 02.30 గంటలకు ముర్రూమ్‌పర సమీపంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడీ కాలికి తగిలి పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ముట్వెండి కెరిపు ఫోర్స్ క్యాంపులో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Next Story