Big Breaking: రాచకొండ పోలీసుల దాడిలో భారీగా గంజాయి లభ్యం

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-30 07:51:52  IST  )

ఎన్నికల వేళ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు.

Big Breaking: రాచకొండ పోలీసుల దాడిలో భారీగా గంజాయి లభ్యం
X

దిశ, రాచకొండ : ఎన్నికల వేళ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు. అయినా ఏ మాత్రం భయం లేని కేటుగాళ్లు తమ అక్రమ సంపాదనను వదులుకోవడం లేదు. పోలీసుల కళ్లుగప్పి గంజాయిని అంతర్ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. తాజాగా రాచకొండ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ కంటైనర్‌లో 710 కేజీల గంజాయిని ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్‌లో పట్టుకున్నారు. కంటైనర్‌తోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై రాచకొండ పోలీసులు మరికొద్ది సేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Next Story