Train accident : రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి..

by Batti.Sumithra |

రైల్వే ట్రాక్ పై పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం భువనగిరి రైల్వే పోలీసులు గుర్తించారు.

Train accident : రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : రైల్వే ట్రాక్ పై పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం భువనగిరి రైల్వే పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం భువనగిరి రైల్వేస్టేషన్ నుండి వంగపల్లి మధ్యలో కిలోమీటర్ 240/30 - 32 దగ్గర దిగువ లైన్ లో గుర్తుతెలియని రైలు కింద పడి గుర్తు తెలియని 40 ఏండ్ల వ్యక్తి మృతిచెంది ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. మృతుని ఒంటిపైన నల్లని టీ షర్టు, నల్లని నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసినవారు భువనగిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ జె. కృష్ణారావు నెంబర్ 9848222169, 8712568454 లకు సమాచారం ఇవ్వగలరని కోరారు.

Next Story