ప్రియుడు డ్రైవింగ్.. ప్రియురాలు చోరీ (వీడియో)

by Disha Web Desk 2 |
ప్రియుడు డ్రైవింగ్.. ప్రియురాలు చోరీ (వీడియో)
X

దిశ, మర్రిగూడ: ఇప్పటి వరకు బైక్ లపై వచ్చి చైన్ స్నాచింగ్ చేసేది కేవలం మగవాళ్లు మాత్రమే అనుకునే వాళ్లం. కానీ అన్ని రంగాల్లో సమానం అన్నట్లుగా ఇప్పుడు లేడీ చైన్ స్నాచర్స్ హల్ చల్ చేస్తుండటం కలకలం రేపుతున్నది. భాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ యువతి చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఘటన తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండలో వెలుగు చూసింది. సినిమాటిక్ రేంజ్ లో ఈ ప్రేమ జంట రెచ్చిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రియుడు డ్రైవింగ్ ప్రియురాలు స్నాచింగ్:

మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా ఈ జంట చోరీకి పాల్పడింది. ప్రియుడు స్కూటీ డ్రైవింగ్ చేస్తుంటే వెనక కూర్చున్న ప్రియురాలు ఓ మహిళ మెడలో ఉన్న గొలుసును లాగేసుకుంది. వెంటనే బాధితురాలు బిగ్గరగా కేకలు వేయగా ఇది గమనించిన స్థానికులు బైక్ పై వారిని వెంబడించే ప్రయత్నం చేశారు. 100 కిలోమీటర్ల వేగంతో వారిని ఛేజ్ చేసే ప్రయత్నం చేసినా ఆ కిలాడీ జంట తప్పించుకుపారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవరకొండ డీఎస్పీ మాట్లాడుతూ లవ్ బర్డ్స్ ను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఇన్నాళ్లు బైక్ లపై పురుషులే వచ్చి మెడలో గొలుసుకు కాజేస్తుండగా తాజాగా ఓ యువకుడు వాహనాన్ని నడుపుతుంటే యువతి మెడలో గొలుసు లాగడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed