రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

by Sridhar Babu |

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
X

దిశ, ఖమ్మం రూరల్ : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం గ్రామానికి చెందిన షేక్. ముస్తఫా పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. దాంతో మంగళవారం ముస్తఫా ఇంట్లో గొడవ పడి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డంగా వెళ్లి మృతి చెందాడు. కుమారుడిని కాపాడబోయిన తండ్రి షేక్ బాజీ కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు గాయాలైన బాజీని 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించగా, ముస్తఫా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మార్చురీకి తరలించారు.

Next Story