- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి… మరొకరి పరిస్థితి విషమం
నల్గొండ జిల్లా కనగల్లు మండలం బాబాసాహెబ్ గూడెం స్టేజి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను లారీ ఢీ కొట్టిన ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ,కనగల్లు: నల్గొండ జిల్లా కనగల్లు మండలం బాబాసాహెబ్ గూడెం స్టేజి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను లారీ ఢీ కొట్టిన ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కనగల్లు ఎస్సై పి.విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా అనుమల మండలం పులిమామిడి గ్రామ పరిధిలో కుమ్మరి కుంట కాల్వకు చెందిన గోగు లింగమ్మ(69) అదే గ్రామానికి చెందిన కన్నేబోయిన కొండల్ ట్రాక్టర్ లో బియ్యం పట్టించుకోని ట్రాక్టర్ లో స్వగ్రామం తిరిగి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ పల్టీ కొట్టి ట్రాలీ రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో కూర్చున్న లింగమ్మ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాక్టర్ డ్రైవర్ కొండలకు సైతం తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని చికిత్స నిమిత్తం నల్గొండలోని సంరక్ష ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






