- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. భర్తను కిరాతకంగా కొట్టి చంపిన భార్య
by GSrikanth |
నిత్యం మద్యం సేవించి వచ్చి వేధిస్తున్న భర్తను భార్య మట్టు హతమార్చింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామం వడ్డెర కాలనీలో జరిగింది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిత్యం మద్యం సేవించి వచ్చి వేధిస్తున్న భర్తను భార్య మట్టు హతమార్చింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామం వడ్డెర కాలనీలో జరిగింది. వడ్డెరకాలం చెందిన బోధస్ లక్ష్మన్ (35)ను భార్య బోదాస్ లక్ష్మి బండరాయితో తలపై మోది హత్య చేసింది. లక్ష్మణ్ తన ఇంట్లోనే నిద్రిస్తుండగా ఈ దారుణానికి పాల్పడింది. ఇద్దరు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బోధస్ లక్ష్మణ్‌పై పలు కేసులు ఉన్నాయి. విషయం తెలిసిన మోపాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి లక్ష్మణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మోపాల్ మండలంలో గడిచిన 24 గంటల్లో రెండు హత్యలు జరిగాయి. రెండు హత్యలు కూడా భార్యల చేతిలో భర్తలు హతమయ్యారు.
Next Story






