- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
suicide : ఉరేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
by Sridhar Babu |
ఇంట్లో సమస్యలతో డిప్రెషన్ లోకి వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ,పటాన్ చెరు : ఇంట్లో సమస్యలతో డిప్రెషన్ లోకి వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొల్లూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి పట్టణానికి చెందిన సాయి కిరణ్ (25) విప్రో సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీహెచ్ఈఎల్
విద్యుత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే కుటుంబ సమస్యల కారణంతో డిప్రెషన్లో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా ఇంట్లో సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- suicide
Next Story






